ఫ్రాన్స్‌లో కరోనా మూడో దశ ప్రారంభం..ప్రధాని

ప్యారిస్‌ : ఫ్రాన్స్‌లో కరోనా మూడో దశ ప్రారంభమైందని ఫ్రెంచ్‌ ప్రధానమంత్రి జీన్‌ కాస్టెక్స్‌ ఆ దేశ పార్లమెంట్‌కు వెల్లడించారు. గత ఏడు రోజుల సగటు కేసులు నవంబర్‌ 20 తర్వాత మొదటిసారిగా 25వేలకు మంచి పెరిగాయని చెప్పారు. మంగళవారం ఫ్రాన్స్‌లో 29,975 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నెలన్నర వ్యవధిలో కేసులు భారీగా పెరిగాయని, గతవారంతో పోలిస్తే 4.5శాతం కేసులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఆసుపత్రి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, లాక్‌డౌన్‌ను మాత్రం తప్పించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/