ఆరు గ్యారంటీల కోసం ఇంటింటి సర్వే చేపట్టబోతున్న సర్కార్

This is Congress Govt.. Prendli Govt: Minister Ponguleti Srinivas Reddy

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధకాలను దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీటిని వెబ్ సైట్ లో ఆన్ లైన్ చేస్తుంది ప్రభుత్వం.

అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువు అయిపోవడంతో దీని మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గ్యారంటీల అమలులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో తప్పకుండా అమలుచేస్తామని అన్నారు. నిజమైన అర్హుల కోసం దరఖాస్తులు అప్లై చేసిన ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తామని చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంటుందని…వంద రోజుల్లో ఆరు గ్యాంటలీను తప్పకుండా అమలు చేస్తామని పొంగులేటి తెలిపారు.

ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని… ఈ నెల 30లోగా డేటా ఎంట్రీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డేటా ఎంట్రీ అప్పుడే మొదలుపెట్టామని…30వేలమందికి పైగా ఆపరేటర్లతో యుద్ధప్రాతిపదికన డేటా ఎంట్రీ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే 13 నుంచి 14 శాతం వరకు ఎంట్రీ పూర్తయిందని చెప్పుకొచ్చారు.