అధునాతన హోండా డియో 125 & హోండా SP 160లను ఆవిష్కరించిన హోండా మోటర్‌సైకిల్ & స్కూటర్ ఇండియా

కొత్త డిజిటల్ స్మార్ట్ కీ ఫీచర్‌తో వస్తున్నాయి

Honda Motorcycle & Scooter India Launches Advanced Honda Dio 125 & Honda SP 160

హైదరాబాద్, ఆగస్ట్ 20, 2023: భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను నెలకొల్పుతూ, స్కూటర్ విభాగంలో అగ్రగామిగా ఉన్న హోండా మోటర్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, 2023 ఆగస్టు 19న హోండా డియో 125 మరియు హోండా SP 160 యొక్క స్మార్ట్ మరియు అప్‌డేట్ వెర్షన్‌లను నగరంలోని పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన ఒక గాలా ఫంక్షన్‌లో ఆవిష్కరించింది. ఇండల్జెన్స్ ఈవెంట్స్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా నేతృత్వంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.

తెలంగాణ జోనల్ హెడ్, సేల్స్ – శ్రీ ఇరానగౌడ సహా జోనల్ హెడ్, సర్వీస్- శ్రీ పార్థసారథి, ఏరియా మేనేజర్, సేల్స్- శ్రీ శలభ్ శ్రీవాస్తవ , ఏరియా మేనేజర్, సేల్స్- శ్రీ పునీత్ కుమార్, ఏరియా మేనేజర్, సర్వీస్ – శ్రీ షానవాజ్, ఏరియా మేనేజర్, సర్వీస్ – శ్రీ జాఫర్ షేక్ తో పాటుగా హైదరాబాద్ జోనల్ ఆఫీస్ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సరికొత్త హోండా డియో 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.85,900. భారతదేశంలో ఇది హోండా యొక్క మూడవ 125cc స్కూటర్ మరియు కొన్ని హైటెక్ డిజిటల్ ఫీచర్లు జోడించబడ్డాయి. అదే విధంగా హోండా SP 160 కూడా పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రైడ్‌కు సంబంధించిన వివిధ వివరాలను ప్రదర్శిస్తుంది. కొత్త హోండా డియో 125 మూడు రకాలైన స్టాండర్డ్, డీలక్స్ మరియు హెచ్-స్మార్ట్‌లలో అందించబడుతుంది. వీటి ధరలు రూ.85,900 నుంచి రూ.93,800 ఎక్స్-షోరూమ్ వరకు ఉన్నాయి.