ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

అమరావతి : ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులు ఫలితాలను examsresults.ap.ac.in లేదా resuits.bie.ap.gov.in లేదా results.apcfss.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని వెల్లడించారు. ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సైతం పాస్‌ మార్కులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఫలితాలు నచ్చని విద్యార్థులకు పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/