శుభాకాంక్ష‌లు తెలిపేందుకు ఎవ‌రూ హైద‌రాబాద్ రావొద్దు

పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు కేటీఆర్ విజ్ఞ‌ప్తి

హైదరాబాద్ : తన పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపేందుకు ఎవ‌రూ హైద‌రాబాద్ రావొద్ద‌ని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ సూచించారు.

మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, రేపు తాను ఎవరిని కలవడం లేదని కేటీఆర్ తెలిపారు. త‌మ‌కు తోచిన విధంగా ఎవ‌రికి వారు ఇత‌రుల‌కు స‌హాయం చేస్తూ.. ముక్కోటి వృక్షార్చ‌న‌లో పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/