నిజాముద్దీన్ మర్కజ్ పై కేంద్ర హోంశాఖ సమగ్ర దర్యాప్తు
మర్కజ్ భవనంలో 1,746 మంది

New Delhi: నిజాముద్దీన్ మర్కజ్ పై కేంద్ర హోంశాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.
మర్కజ్ కార్యక్రమానికి ఎవరెవరు హాజరయ్యారు అన్న విషయంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి వచ్చిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు హోంశాఖ నిర్థారించింది.
విదేశాల నుంచి వచ్చిన వారు మర్కజ్ భవనంలో రిపోర్టు చేసే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తారని, వీరు వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కోర్డినేటర్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పింది.
మార్చి 21 నాటికి మర్కజ్ భవనంలో 1,746 మంది ఉన్నారని, వారిలో 1530 మంది దేశీయలు కాగా.. 216 మంది విదేశీయలు ఉన్నట్లు తెలిపింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/