తెలంగాణ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లాగే డ్రగ్స్ టెస్టులు…

హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ బయటపడడం తో ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకుంది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లాగే డ్రగ్స్ టెస్టులు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. వీటి ద్వారా ఉమ్ము, మూత్రం శాంపిళ్లను సేకరించి నిమిషాల్లోనే డ్రగ్ టెస్ట్ చేసి గుర్తించనున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులలాగే డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ముఖ్య ప్రాంతాల్లో డ్రగ్ టెస్టులు చేయాలని భావిస్తున్నారు.

రిజల్ట్ పాజిటివ్గా వస్తే బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి నిర్థారించుకోనున్నారు. ఇప్పటికే కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ ప్రయోగం చేపట్టగా సక్సెస్ అయింది. దీంతో హైదరాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ టెస్టు నిర్వహించేందుకు డ్రగ్ అనలైజర్లు వాడనున్నారు. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అనలైజర్లోని రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను ఈ డ్రగ్ అనలైజర్లు గుర్తిస్తాయి. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డ్రగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆమోదంతో డ్రగ్‌ ఎనలైజర్లను కొనుగోలు చేసి, ముందుగా ట్రయల్‌ రన్‌ చేయనున్నారు. ఆ తర్వాత సిబ్బందికి ట్రైనింగ్‌ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వాడాలని యోచిస్తున్నారు.