నా రాజీనామా కోరడానికి ఆయనెవరు?: సుచరిత

జగన్ ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా రాజీనామా చేస్తా

అమరావతి: ఏపీ హోంమంత్రి సుచరిత టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై మండిపడ్డారు. తన రాజీనామా కోరడానికి ఆయన ఎవరని మండిపడ్డారు. టీడీపీ హయాంలో వంగవీటి రంగాను హత్య చేశారని… అప్పుడు ఆయనకు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే జగన్ పై కోడికత్తితో దాడి జరిగిందని… ఆ దాడిపై టీడీపీ నేతలు ఎగతాళి చేశారని అన్నారు. దళిత మహిళను జగన్ హోంమంత్రిని చేస్తే మీకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు.

మహిళల కోసం గత చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని సుచరిత విమర్శించారు. మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని… మహిళలపై చంద్రబాబుకు నిజంగా గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును టీడీపీ గౌరవించడం లేదని మండిపడ్డారు. తమ పాలన నచ్చకపోతే ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు. జగన్ ఆదేశిస్తే ఏ క్షణమైనా తాను రాజీనామా చేస్తానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/