విశాఖ ఉక్కు ప్రైవేటుకే…కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

స్టీల్ ప్లాంట్ లో రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదు

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయరాదంటూ రాష్ట్రంలోని అన్ని పార్టీలు (బీజేపీ మినహా) ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వైస్సార్సీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కుండబద్దలు కొట్టింది.

వైస్సార్సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ… స్టీల్ ప్లాంట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు. ఈ ప్లాంటు నుంచి 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నామని సంచలన ప్రకటన చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 27నే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేకపోయినప్పటికీ… నిర్దేశించిన అంశాల్లో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/