ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం..రెండు రోజులు పాఠశాలలకు సెలవు

holidays-for-primary-schools-in-delhi-with-air-quality-worsens

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేసింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.

కాగా, కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌ పరిధిలో అనవసరమైన నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అదేవిధంగా వాయు కాలుష్యాన్ని నియంత్రిచండానికి డీజిల్‌ వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించింది.