‘ఆమ్ ఆద్మీ’ రాజ్యసభ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌

పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

Harbhajan Singh as 'Aam Aadmi' Rajya Sabha candidate
Harbhajan Singh as AAP’ Rajya Sabha candidate

టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో హర్భజన్ సింగ్‌ను త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. పంజాబ్ నూతన సీఎం భగవంత్ మాన్ ఆయనతో చర్చలు జరిపి రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ నెలాఖరులో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 5 రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అందులో ఒక స్థానానికి హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.

హర్భజన్ కెరీర్

1998లో భారత్ జట్టులోకి వచ్చిన హర్భజన్., 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టారు. వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశారు. 2016 మార్చి 3న చివరిసారిగా భారత్ తరఫున యూఏఈతో టీ20 మ్యాచ్‌లో ఆడారు.

మార్చి నెలాఖరులోగా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభకు ఐదు సీట్లు రాబోతున్నాయి. ఇందులో తొలి అభ్యర్థి గా హర్భజన్ సింగ్ పేరును పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్భజన్ సింగ్ సన్నిహిత మిత్రులుగా పేరుందనే విషయం తెలిసిందే.

తెర (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/