ఓటిటి లోకి శ్రీలీల ఫస్ట్ మూవీ ‘కిస్’ రిలీజ్

శ్రీ లీల నటించిన ఫస్ట్ కన్నడ మూవీ..ఇప్పుడు తెలుగు లో ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడలో శ్రీలీల ‘కిస్’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. 2019లో వచ్చిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులో రొమాంటిక్ సీన్స్ డోస్ కాస్త గట్టిగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు కొట్టేసి బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం శ్రీలీల నటించిన ‘ఐ లవ్ యూ ఇడియట్’ పేరుతో ఆహాలో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీలీల..ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కడుతూ వస్తుంది. ప్రస్తుతం రామ్ , నితిన్ , వైష్ణవ్ తేజ్ సరసన జోడి కట్టబోతుంది. అలాగే సీనియర్ నటుడు బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే చిత్రంలో బాలకృష్ణ కూతురి గా నటించబోతుంది. ఇలా వరుస సినిమాల తో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించబోతుంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో పవన్ కు జోడి గా నటించబోతుంది. ఇక ఈ సినిమాలో మరో నాయికగా మాళవిక మోహనన్ కనిపించనుంది. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.