ర‌ష్యాను నిలువ‌రించండి.. ప్ర‌పంచ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞ‌ప్తి

కీవ్: ర‌ష్యాను నిలువ‌రించేందుకు ప్ర‌పంచ దేశాలు ముందుకు రావాల‌ని జెలెన్‌స్కీ విజ్ఞ‌ప్తి చేశారు. ఈరోజు ఉద‌యం నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. అయితే రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైనికులు ధీటుగా స్పందిస్తున్నారు. లుహాన్స్‌ రీజియన్‌లో ర‌ష్యాకు చెందిన‌ ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అయితే ఉక్రెయిన్‌పై దాడుల నేప‌థ్యంలో ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ స్పందించారు. అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్, బ్రిట‌న్, జ‌ర్మ‌నీ, పోలాండ్ దేశాల అధ్య‌క్షుల‌తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. పుతిన్ వ్య‌తిరేకంగా సంకీర్ణ కూట‌మిని ఏర్పాటు చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా తాము ప‌లు దేశాల‌తో మ‌ద్ద‌తు కూడ‌గడుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/