తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో వినూత్న నిరసనకు దిగారు. పార్టీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన జేసీ ప్రభాకర్.. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. మున్సిపల్ వాహనాల రిపేర్లకు ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిని నిరసనిస్తూ భిక్షాటనకు దిగారు.

మెడలో ఒక ప్ల కార్దుతో నిరసన ప్రారంహించారు. ఆ కార్డు మీద నా నినాదం – నా అజెండా అని రాసి ఉంది. దీనికి కొనసాగింపుగా క్లీన్ తాడిపత్రి – గ్రీన్ తాడిపత్రి అనే నినాదంతో జేసీ నిరసన ప్రారంభించారు. తాడిపత్రి పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని తాము భావిస్తుంటే కనీసం వాహనాల రిపేర్లకు డబ్బులు కూడా ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో పోలీసులు ప్రభాకర్ రెడ్డి ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం వెంటనే వాహనాల రిపేర్లకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేకపోతే, పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద గోచీతో భైఠాయిస్తానని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెలుచుకున్న ఏకైక మున్సిపాల్టీ తాడిపత్రి ఒక్కటేనని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేసారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన తాము తాడిపత్రి అభివృద్ది కోసం పని చేస్తుంటే నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని ఆరోపించారు.