పాపం..ఓటమి దెబ్బకు టీడీపీ నేతలు ఏమాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు

పాపం..ఓటమి దెబ్బకు టీడీపీ నేతలు ఏమాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు

వైసీపీ ప్రభంజనం మరోసారి స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ప్రజలు మాత్రం ఫ్యాన్ ను మాత్రమే చూస్తున్నారని మరోసారి మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రుజువుయ్యింది. ఇక్కడ..అక్కడ కాదు చంద్రబాబు కంచు కోట లోను వైసీపీ జెండా ఎగరవేసిందంటే..జగన్ ను ప్రజలు ఎంతగా నమ్ముతున్నారో అర్ధం చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ గాలి కి సైకిల్ పంక్చర్ అయ్యి మూలపడింది. ఈ ఓటమికి తెలుగుదేశం నేతల మైండ్ బ్లాక్ అయ్యినట్లు ఉంది. వారు ఏమాట్లాడుతున్నారో వారికీ అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నారు.

వైసిపి సాధించిన గెలుపుపై వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వైసిపి సాధించిన విజయం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో సాధించిన గెలుపు ఓ గెలుపేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఓ గెలుపేనా అంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

ఇక నారా లోకేష్ దొంగ ఓట్లు, వందల కోట్లు, గూండాగిరి, అధికారులు-పోలీసుల అండతో కుప్పంలో గెలిచామని… లోకేశ్ రెండు చెంపలను ప్రజలు పగలగొట్టారని వైసీపీ శునకానందంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వీరి కామెంట్స్ ను చాల లైట్ తీసుకున్న వైసీపీ నేతలు , కార్యకర్తలు టీడీపీ ఓటమిలో ఏమాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని కామెంట్స్ వేస్తున్నారు.