మొయినాబాద్ కేసులో హైకోర్టు కీలక తీర్పు

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఏసీబీ కోర్ట్ పోలిసుల తీరు ఫై తప్పు పడుతూ..అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను విడుదల చేయాలనీ ఆదేశించగా..ఈరోజు హైకోర్టు సైతం పోలిసుల తీరును తప్పుపట్టింది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన కేసులో నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

పోలీసులు ఏసీబీ ప్రోజిజర్ ఫాలో కాలేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్‌లో ఏసీబీ మాత్రమే అరెస్ట్ చూపాలని పేర్కొంది. లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ నిందితులను రిమాండ్ చేసే అర్హత లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పీసీ యాక్ట్ పెట్టినప్పుడు ఏసీబీ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని కోర్టు పేర్కొంది.