విస్కాన్సిన్ డెమోక్రాట్ల వశం..
49.4 % ఓట్లతో బైడెన్ విజయం

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్కాన్సిన్ రాష్ట్రంలో బైడెన్ విజయకేతనం ఎగురవేశారు.
ఇక్కడ బైడెన్‌కు 49.4 శాతం ఓట్లను సాధించి విజయం సొంతం చేసుకున్నారు. ట్రంప్ 48.8శాతం ఓట్లు గెల్చుకున్నారు.
ట్రంప్‌పై కేవలం స్వల్ప 0.6శాతం ఓట్ల తేడాతో విస్కాన్సిన్ డెమోక్రాట్ల వశమైంది.
ఇక్కడి మొత్తం 10 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ గెల్చుకోవటంతో మొత్తం ఆయన గెలుచుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 237కుచేరింది..
అధ్యక్ష పీఠానికి కావాల్సి 270 రావటానికి ఇంకా ఆయన 33 ఓట్లను సాధించాల్సి ఉంది.. కాగా ట్రంప్ ఇప్పటిదాకా 214 గెల్చుకున్న విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/