మునుగోడు అడ్డా..కాంగ్రెస్ అడ్డా – రేణుక చౌదరి ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి..మునుగోడు అడ్డా..కాంగ్రెస్ అడ్డా అని పేర్కొంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయిని స్రవంతిని గెలిపించాలని ఓటర్లను కోరారు. మునుగోడు అభివృద్ధిని ఏ పార్టీలు పట్టించుకోలేదని రేణుక విమర్శించారు. మునుగోడు కాంగ్రెస్ కు అడ్డా అని , మరోసారి మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి తీరుతారని ధీమా వ్యక్తం చేసారు.

ఇక ఉప ఎన్నిక ప్రచార సమయం ముగియబోతుండడం తో అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసారు. ఇప్పటికే పార్టీ కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. రేపు టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరు మండలం బంగారు గడ్డలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లను నేతలు , అధికారులు పూర్తి చేసారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఓటర్లను సీఎం కేసీఆర్ కోరనున్నారు. నవంబర్ 3న జరగనున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు 6న వెలువడనున్నాయి. మొత్తం బరిలో 47 మంది ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.