రాహుల్ తో కలిసి పాదయాత్ర పాల్గొన్న పూనం కౌర్
రాహుల్ ను కలిసి సంఘీభావాన్ని ప్రకటించిన పూనం కౌర్

ధర్మపురి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురిలో ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా సినీ నటి పూనం కౌర్ రాహుల్ గాంధీని కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఉస్మానియా విద్యార్థులతో పాటు ఆమె రాహుల్ ను కలిశారు. రాహుల్ తో కలిసి నడిచారు. రాహుల్ తో నడుస్తూ, ఆయనతో పూనం మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఈరోజుతో నాలుగో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన 20 కిలోమీటర్లు నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం జడ్చెర్లలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిన్న రాత్రి ఆయన ధర్మాపూర్ లో బస చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/