నాని 30 మూవీ టైటిల్ ఇదే..

దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం తన 30 వ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే పేరు ఖరారు చేశారు. దీనికి సంబదించిన చిన్న గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అందులో నాని, మృణాల్ ఠాకూర్, చిన్న పాప వున్నవి చూపించి ఇది తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో వున్న కథ అని తెలిపారు.

ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఎమోషనల్ స్టోరీగా అర్థం అవుతోంది. ఈ సినిమాలో నాని భార్య దూరం కావడం వల్ల పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారి జీవితంలోకి మృణాల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాన్న గురించి కొన్ని ఎమోషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే నాన్న ఎమోషన్ తో కూడిన ఓ సినిమాలో నటించారు. గతంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతోనే ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

YouTube video