సంగారెడ్డి జిల్లాలో హెట్రో ల్యాబ్ లోకి చిరుత ..భయాందోళనలో కార్మికులు

గత కొద్దీ నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతల , పులుల సంచారం ఎక్కువైనా సంగతి తెలిసిందే. అడవుల్లో ఉండాల్సిన పులులు జనావాసాల్లోకి వచ్చి హడలెత్తిస్తున్నాయి. మూగజవాలను చంపడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెట్రో ల్యాబ్ లోకి చిరుత ప్రవేశించింది.

దీంతో కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు. పరిశ్రమలోని ఓ బ్లాక్ లో చిరుత పులి ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. సీసీ ఫుటేజ్ లను చెక్ చేస్తూ చిరుత ఎక్కడెక్కడ ఉందనేది చూస్తున్నారు. లోపల ఉన్న కార్మికులను బయటకు రప్పించారు.