గణేష్ నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు

గణేష్ నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేసారు. సుమారు 2500 మందితో షా అలీ బండ, అలియాబాద్‌, లాల్‌దర్వాజ, ఫలక్‌నుమా, నాగుల్‌చింత, చాంద్రాయణగుట్ట, హుస్సేనీ అలం ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో రెండు వేలకు పైగా వినాయక విగ్రహాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ విభాగాలతో సమన్వయం చేసుకున్న పోలీసులు.. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పాతబస్తీ సౌత్ జోన్ వ్యాప్తంగా సుమారు 1,700 వినాయక విగ్రహాల ఏర్పాటు చేశారు. అనధికారికంగా మరో 200 విగ్రహాలను ప్రతిష్టించారు. శుక్రవారం పాతబస్తీలో నిర్వహించే సామూహిక గణేశ్ నిమజ్జనం కోసం వివిధ విభాగాల సమన్వయంతో శోభాయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. వేడుకలు ప్రశాంతంగా కొనసాగడానికి ప్రతి కదలికను పోలీస్ విభాగం గమనిస్తోంది. అందుబాటులో రెండు కంపెనీల R.A.F( రాపిడ్ యాక్షన్ ఫోర్స్) బలగాలతో పాటు క్విక్ రియాక్షన్ పోలీస్ ఫోర్స్ & సిటీ ఆర్బ్ రిజర్వ్ & హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ & మఫ్టీ డిసిపి ఏసిపి క్రైమ్ పార్టీ & ఇంటెలిజెన్స్ ఎస్.బీ & రెండు టీమ్స్ బాంబ్ & డాగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా రంగంలో దిగుతున్నాయి.

బాలాపూర్ మొదలు ప్రతి వినాయక విగ్రహం కదలికపై పోలీస్ నిఘా ఉండనుంది. వీటితో పాటు ఈ సారి క్విక్ రెస్పాన్స్ & స్పెషల్ స్ట్రైకింగ్ పోలీస్ టీమ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. పాతబస్తీలో నిమజ్జనం రూట్ మ్యాప్ అంతా సీసీ కెమెరాలతో పాటు అదనపు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు.