తెలంగాణాలో పలుచోట్ల భారీ వర్షం

రైతులకు అపార నష్టం

తెలంగాణాలో పలుచోట్ల భారీ వర్షం
crop damage

Hyderabad: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం రైతులను తీవ్ర వేదనలో ముంచింది.

కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలో వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి.

ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ఎక్కడికక్కడ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారంలో పిడుగుపాటుకు తండ్రి మృతిచెందగా కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు.

చికిత్స నిమిత్తం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో పల్లా శ్రీనివాస్‌(45) అనే వ్యక్తి, నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని మెట్టుమర్రితండాలో కోతవత్‌ శీల(42) అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.

తాజా ‘మొగ్గ (చిన్నారుల ప్రత్యేకం) కోసం :https://www.vaartha.com/specials/kids/