వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్

Bonthu Rammohan, Mayor, Hyderabad
Bonthu Rammohan, Mayor, Hyderabad

HyderabadL : నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు.

ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆహారం పంపిణీలో దాతలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. సరుకులు, ఆహారం తీసుకునే వారు కూడా భౌతికదూరం పాటించాలన్నారు.

ఎవరికి వారు సొంతంగా పంపిణీ చేయకుండా అధికారులను సంప్రదించాలన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/