దేశ రాజధానిలో కుండపోత!

ద్వారకాలోని అండర్‌పాస్‌ జలమయం

Heavy rain in New Delhi
Heavy rain in New Delhi

New Delhi: ఢిల్లీలో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది.

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ద్వారకాలోని అండర్‌పాస్‌ జలమయం అయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌  ప్రాంతంలో వరద నీరు చేరడంతో.. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీతో పాటు నోయిడా, రోహతక్, జింద్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, ఫరిదాబాద్‌, ఆగ్రా, బులంద్‌షర్‌ ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/