ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు

సాయేషా సైగల్ ఆనందం

Sayesha Saigal. .Birthday celebration with family

‘అఖిల్’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి హీరోయినుగా తెరంగేట్రం చేసింది ముంబై భామ సాయేషా సైగల్. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా సాయేషా సుపరిచితమే.

 లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం అయిన హీరోయిన్ సాయేషా సైగల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

గత ఏడాది మార్చి నెలలో హీరో ఆర్యని సాయేషా ప్రేమించి.. పెళ్లి చేసుకుంది. గురువారం కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటుంది.

ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. అలాగే తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ సోషల్ మీడియాలో ఫ్యామిలీతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది.

 ప్రస్తుతం ఈ అమ్మడు టెడ్డీ అనే తమిళ సినిమాలో హీరోయినుగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో భర్త ఆర్యనే హీరో కావడం విశేషం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/