చంద్రబాబు స్వగ్రామంలో భారీ బందోబస్తు

Police protection
Police protection

చిత్తూరు: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సిపి, విపక్ష టిడిపి పార్టీలు నేడు పోటాపోటీ సభలను నిర్వహించేందుకు తలపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార వికేంద్రీకరణతో వచ్చే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో చంద్రగిరిలో సభ జరుగనుంది. ఈ సభకు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సిపి సభకు పోటీగా నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిరసన సభ నిర్వహించాలని తలపెట్టిన టిడిపి పెద్ద ఎత్తున జన సమీకరణకు దిగింది. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేకున్నా సభ నిర్వహించి తీరుతామని టిడిపి నేతలు స్పష్టం చేయడంతో, అదనపు బలగాలను రంగంలోకి దించారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/