ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. తన పిటిషన్ ను త్వరగా విచారించాలన్న కవిత అభ్యర్థులను తిరస్కరించింది సుప్రీం కోర్టు. ఈ నెల 24వ తేదీనే విచారిస్తామని తేల్చి చెప్పింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ అత్యవసరం పిటీషన్ దాఖలు చేసారు కవిత. దీనిపై మార్చి 17వ తేదీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం విచారణ చేసింది. మీ పిటీషన్ పరిశీలించాం.. ముందుగా నిర్ణయించినట్లు.. మార్చి 24వ తేదీనే విచారిస్తాం అని స్పష్టం చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటుంది కవిత, ఇప్పటికే ఈ నెల 11 ఈడీ అధికారులు కవితను విచారించడం జరిగింది. దాదాపు 09 గంటల పాటు విచారించడం జరిగింది. నిన్న (మార్చి16) న మరోసారి విచారించాల్సి ఉండగా..కవిత హాజరుకాలేదు. దీంతో ఈ నెల 20 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.