భారత్‌లో మరో కరోనా కేసు

Coronavirus in india
Coronavirus in india

తిరువనంతపురం: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా రెండో కేసు కేరళలో నమోదైంది. కరోనా బారిన పడిన బాదితుడిని ప్రస్తుతం ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ సోకిన వ్యక్తి ఇటీవలే చైనాలో పర్యటించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికే కేరళలో తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితురాలు చైనాలోని వుహాన్‌ నగరంలో వైద్య విద్యనభ్యసింస్తుంది. అయితే వైరస్‌ తీవ్రతకు భయపడి కేరళకు తిరిగి వచ్చింది. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పుణెకు పంపగా కరోనా సోకిన విషయం బయటపడింది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నదని అధికారులు తెలిపారు. కాగా తాజా కేసుతో ప్రస్తుతం భారత్‌లో రెండు కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు. మరోవైపు చైనాలో కరోనా వైరస్‌ దాటికి ఇప్పటికే 304 మంది మరణించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/