మణిపూర్‌లో ఆగని హింస..బిష్ణుపూర్‌లో ముగ్గురి మృతి

కుకీల ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

Heavy firing in Manipur’s Bishnupur after 3 killed in violence, houses burnt

మణిపూర్‌: మణిపూర్‌లో ఇంకా హింస కోనసాగుతునే ఉంది. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతానికి రెండు కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న బఫర్‌జోన్‌ వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతానికి రెండు కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న బఫర్‌జోన్‌ వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.