గుడ్ న్యూస్.. అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్

జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు ఇకపై అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో క్యాషెస్ ట్రీట్మెంట్ను పొందొచ్చు. ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ వెల్లడించింది. ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రుల్లోనూ ఈ సేవలు వినియోగించుకోవచ్చు.

సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలను సంప్రదించి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌పై కీలక ప్రకటన చేసింది. కేవలం నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనే కాకుండా ఇప్పుడు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుబాటులోకి తెచ్చేందుకు క్యాష్‌లెస్ ఎవ్‌రీవేర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆరోగ్య బీమా ఉన్న పాలసీదారుడు ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన నెట్ వర్క్ ఆస్పత్రులతో పాటు ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఇకపై నగదు రహిత చికిత్స చేయించుకునే వీలు కలుగుతుంది. ఈ కొత్త రూల్‌ జనవరి 24 నుంచే ప్రారంభమైనట్లు జీఐసీ స్పష్టం చేసింది.

క్యాష్‌లెస్ ఎవరీ‌వేర్‌లో భాగంగా.. పాలసీదారుడు క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ ఫెసిలిటీ ద్వారా ఏ ఆస్పత్రిలోనైనా నగదు రహిత చికిత్సకు అర్హుడు. ఆ ఆస్పత్రి.. మీ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్ లిస్ట్‌లో లేకున్నా ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. అప్పటికీ సదరు బీమా సంస్థ.. ఆస్పత్రికి పూర్తి మొత్తం చెల్లిస్తుంది. పాలసీదారుడికి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కు అర్హత కల్పిస్తుంది. దీంతో.. ఇది ఆరోగ్య బీమా పాలసీదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు.