దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు

మార్ఫింగ్ వీడియో ప్రదర్శించారని ఫిర్యాదు

Devineni Uma
Devineni Uma

Kurnool: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేసి నకిలీ వీడియోలు ప్రదర్శించారనే ఫిర్యాదుతో మాజీ మంత్రి, దేవినేని ఉమాపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా ప్రదర్శించిన వీడియో ఫోర్జరీ అని , దానిని మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ వైసీపీ లీగల్ సెల్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న తిరుపతిలో ప్రచారం నిర్వహించిన దేవినేని ఉమా ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. అందులో వీడియో ఫోర్జరీ చేసినదనిm ఆరోపిస్తూ జిల్లా వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/