పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష రద్దు

గత డిసెంబర్ 17న మరణశిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం

Pervez Musharraf
Pervez Musharraf

లాహోర్‌: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఆ దేశం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, ముషారఫ్ కు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు వీలులేదని, చట్ట ప్రకారం ఆ నిబంధనలు లేవని ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ పేర్కొందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అసలు ప్రత్యేక కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించిందని, ఈ ఆదేశాల మేరకు ముష్రారఫ్ కు మరణశిక్ష రద్దయిందని చెప్పారు. కాగా, 2013 డిసెంబరులో ముషారఫ్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. గత ఏడాది డిసెంబర్ 17న ముషారఫ్ కు మరణశిక్ష విధించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/