వైరల్ లోడ్ ప్రమాదకరం

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వెల్లడి

Vinod Kumar
Vinod Kumar

Hyderabad:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను మరింత ప్రబలిస్తున్న వైరల్ లోడ్ అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
అన్నారు

అంతర్జాతీయ వైద్య నిపుణులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఉన్న డాక్టర్ కే శ్రీనాథ్ రెడ్డి, ఆ సంస్థకు హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సౌత్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జీ వీ ఎస్ మూర్తి లతో వినోద్ కుమార్ ఆదివారం కరోనా అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

కరోనా వైరస్ , దానిపై పోరాటానికి అనుసరించాల్సిన మార్గాలపై వారితో వినోద్ కుమార్ విపులంగా మాట్లాడారు.

శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలున్న వ్యక్తితో వారి కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరిపినా, శుభకార్యాలు, సమావేశాలు, ఆయా మతాల కార్యక్రమాల నెపంతో పెద్ద సంఖ్యలో జనాలు ఒకే చోట గుమిగూడినా వైరల్ లోడ్ కు కారకులు అవుతారని పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/