సిద్ధిపేట వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి హరీశ్ రావు

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్ధిపేట వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం సమర్పించారు మంత్రి హరీశ్ రావు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్బంగా అన్ని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల తాకిడి నడుస్తుంది. ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక సిద్ధిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు.

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీష్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని , స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. అనంతరం వెంకటేశ్వరునికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కిరీటం తయారీలో ఆలయ వర్గాలతో పాటు హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు. ఈ స్వర్ణ కిరీటం బరువు 1.792 కిలోలు కాగా, ఇందులో కిలో బంగారం ఆలయ వర్గాలు కొనుగోలు చేయగా, మిగిలిన బంగారం హరీశ్ రావు తదితర దాతలు సమకూర్చారు. ఈ పసిడి కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా.