భోళాశంకర్ లో శ్రీయ ఐటెం సాంగ్..?

పెళ్లై..ఓ బిడ్డకు తల్లైనా శ్రీయ డిమాండ్ ..క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది. మ్యూజిక్ స్కూల్ లాంటి చిన్న సినిమాల్లో టీచర్ పాత్రలు పోషించినా..తన గ్లామర్ అప్పీరియన్స్ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు రుజువు చేస్తేనే ఉంది. తాజాగా ఈ అమ్మడికి మెగా ఛాన్స్ తలుపు తట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో భోళాశంకర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. కాగా ఈ మూవీ లో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట మేకర్స్. ఈ సాంగ్ లో శ్రీయ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. అయితే ఆ సాంగ్ కు కోటి డిమాండ్ చేసిందట. అయినప్పటికీ మేకర్స్ ఆమెనే కావాలని ఫిక్స్ అయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలి కాలంలో స్టార్ హీరోయిన్లే ఐటం భామలు గానూ రాణిస్తున్నారు. హీరోయిన్ ఇమేజ్ ని పక్కనబెట్టి నటించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అలాంటి వాళ్లకు పోటీగానూ శ్రియ నెటి తరం నటీమణులతో పోటీ పడటం విశేషమనే చెప్పాలి.