నెక్స్ట్ సీఎం పవనే – హరిరామజోగయ్య సర్వే

రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం స్థానంలో కూర్చుపెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య అన్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతుంది. అధికార పార్టీ తో పాటు ప్రతి పక్ష పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. యాత్రలు , సమావేశాలు , సభలతో ప్రజలకు దగ్గరవుతున్నారు.

ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో హరిరామజోగయ్య చేసిన సర్వేలో జనసేనకు మెజారిటీ స్థానాలు దక్కనున్నట్లు తేలిందన్నారు. సీఎం అవుతానంటూ పవన్ చేస్తున్న ప్రకటన ప్రజల్లో జోష్ నింపిందని తన సర్వేలో ఆయన పేర్కొన్నారు. కులాల వారీగా ప్రజల అభిప్రాయం చూస్తే.. జనసేనకు 80 శాతం మంది కాపులు సపోర్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీకి 8 శాతం, అధికార పార్టీ వైస్సార్సీపీ కి 12 శాతం కాపులు మద్ధతిస్తున్నట్లు వెల్లడించారు.

బీసీలు 25 శాతం సపోర్ట్‌ చేస్తుండగా టీడీపీకి 40 శాతం మంది, వైస్సార్సీపీ కి 35 శాతం మంది మద్ధతిస్తున్నారు. ఎస్సీలు కూడా 26 శాతం మంది జనసేన వైపు ఉన్నారు. టీడీపి 14 శాతం, వైస్సార్సీపీ కి 60 శాతం మంది అండగా ఉన్నట్లు సర్వేలో హరిరామజోగయ్య పేర్కొన్నారు. జనసేన పథకాలను పూర్తిస్థాయిలో ప్రకటిస్తే వారాహి యాత్ర పూర్తయ్యే నాటికి మరింత సపోర్ట్‌ పెరిగే అవకాశ ఉందని హరిరామజోగయ్య అన్నారు.