డెన్మార్క్ ప్ర‌ధానికి ప్ర‌ధాని మోడీ ఘ‌న స్వాగ‌తం

న్యూఢిల్లీ : నేడు ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో డెన్మార్ ప్ర‌ధాని మెట్టె ఫ్రెడెరిక్స‌న్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ఆమెకు గౌర‌వ వంద‌నం ల‌భించింది. ఫ్రెడెరిక్స‌న్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భార‌త్‌కు వ‌చ్చారు. ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర‌ప‌తి కోవిడ్‌తో ఆమె ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. భార‌త్‌ను స‌న్నిహిత భాగ‌స్వామిగా గుర్తిస్తామ‌ని ఫ్రెడెరిక్స‌న్ తెలిపారు. డెన్మార్క్‌-భార‌త్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ప‌ర్య‌ట‌న ఓ మైలురాయిగా మిగులుతుంద‌ని ఆమె చెప్పారు. రాజ్‌ఘాట్ వ‌ద్ద మ‌హాత్ముడికి పుష్ప‌ నివాళి అర్పించారామె.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/