ఎం.డి.యు వాహనాలను పరిశీలించిన గుంటూరు జిల్లా కలెక్టర్

పర్యవేక్షణ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన

Collector Samuel Anand Kumar inspecting M.D.U vehicles

Guntur: పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో మారుతి సుజుకి పార్కింగ్ ప్రదేశంలో, విజయవాడ పోలీస్ ఏ ఆర్ గ్రౌండ్ , పిడబ్ల్యూడి గ్రౌండ్ లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎం డి యు)  వాహనాలను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్, సంయుక్త కలెక్టర్( రెవెన్యూ , రైతు భరోసా) ఏ ఎస్ దినేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. 

వాహనాల ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్ధేశించిన విధంగా వాహనాలన్నీ బెంజ్ సర్కిల్ కు  తరలించాలన్నారు.  వాహనాల పనితీరును జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం ముగిసి వాహనాలు జిల్లాకు చేరుకునే వరకు వీఆర్వోలు, లబ్ధిదారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పర్యవేక్షణ అధికారులు కార్యక్రమం ముగిసేవరకు నిరంతరం అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు.  అనంతరం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఎం డి యు వాహనాల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ మయూర అశోక్, జిల్లా పౌరసరఫరాల అధికారిణి పద్మశ్రీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జయంతి,  గుంటూరు ఆర్టీవో భాస్కర్ రెడ్డి, గుంటూరు తూర్పు, పడమర, మాచర్ల, తాడేపల్లి తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/