ఖమ్మంలో ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక సూసైడ్

ఓ పక్క కోర్టులు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న మహిళలపై , మైనర్ బాలికలపై వేదింపులు ఆగడం లేధు. కొంతమంది కామంతో వావివరుసలు మరచిపోయి..ప్రవర్తిస్తుంటే..మరికొంతమంది ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించమని వెంట పడడం..కాదంటే చంపేయడం చేస్తున్నారు. తాజాగా ఖమ్మంలో
వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం..జిల్లాలోని గ్రామానికి చెందిన బాలిక (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన బాలుడు (17) ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పుకోలేక.. మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.