పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడం సంతోషంగా ఉందిః పీవీ కుమార్తె వాణీదేవి

Happy to announce Bharat Ratna to PV: PVs daughter Vani Devi

హైదరాబాద్‌ః పీవీ న‌ర‌సింహారావుకు కేంద్ర ప్ర‌భుత్వం భార‌త ర‌త్న ప్ర‌క‌టించ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆయ‌న కుమార్తె వాణీదేవి స్వాగ‌తించారు. పీవీకి భార‌త‌ర‌త్న ఆల‌స్యంగా ప్ర‌క‌టించినా సంతోషంగా ఉంద‌ని అన్నారు. పీవీకి భార‌త‌ర‌త్న తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల‌తో పీవీ న‌ర‌సింహారావు దేశాన్ని ముందుకు న‌డిపించార‌ని కొనియాడారు. గొప్ప వ్య‌క్తుల‌కు స‌న్మానం మ‌న సంస్కార‌మ‌ని అన్నారు. పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించినందుకు ఆమె కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇక మాజీ ప్ర‌ధాని పీవీ న‌రసింహారావు, చ‌ర‌ణ్ సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల‌ ఎల్ కే అద్వానీ, క‌ర్పూరీ ఠాకూర్‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అత్యున్న‌త పౌరపుర‌స్కారం ప్ర‌క‌టించింది.