ఢిల్లీ బజార్ పేరుతో వెబ్ పోర్టల్‌ : సీఎం కేజ్రివాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామికవేత్త‌లు, వృత్తి నిపుణుల కోసం అక్క‌డి ప్ర‌భుత్వం కొత్త వెబ్ పోర్ట‌ల్‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్‌ కేజ్రివాల్ వెల్ల‌డించారు. ఢిల్లీ బ‌జార్ పేరుతో తాము ఒక వెబ్ పోర్ట‌ల్‌ను సిద్ధం చేస్తున్నామ‌ని, ఈ వెబ్ పోర్ట‌ల్ ద్వారా వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, వృత్తి నిపుణులు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చ‌ని ఆయన తెలిపారు.

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్ర‌జ‌లు దీపావ‌ళి పండుగ స‌రంజామా కోసం మార్కెట్ల‌కు పోటెత్తుతున్నారు. ర‌ద్దీ ప్రాంతాల్లోనూ జ‌నం మాస్కులు లేకుండా క‌నిపిస్తున్నారు. ద‌య‌చేసి అంద‌రూ ఫేస్ మాస్కులు ధరించండి అని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయని, ప‌రిస‌రాల్లో నిలువ నీరు లేకుండా చూసుకోవ‌డం ద్వారా డెంగీని నివార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కేజ్రివాల్ కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/