మునుగోడు ఉప ఎన్నిక కోసం 86 మందిని ఇంచార్జ్ లుగా నియమించిన టీఆర్ఎస్

TRS munugode incharges

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం 86 మందిని మునుగోడు ఇంచార్జ్ లుగా నియమించింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా మొత్తం 86 మంది పార్టీ నేతలను ఇంచార్జిలుగా ప్రకటించింది.

దీనికి సంబంధించి జాబితాను పార్టీ విడుదల చేసింది. చండూరు మున్సిపాలిటీకి ఐదుగురిని, చండూరు మండలానికి 11 మందిని, చౌటుప్పల్ మున్సిపాలిటీకి 10 మందిని, చౌటుప్పల్ మండలానికి 12 మందిని, మర్రిగూడ మండలానికి 11 మందిని, మునుగోడు మండలానికి 13 మందిని, నాంపల్లి మండలానికి 11 మందిని, నారాయణపూర్ మండలానికి 13 మందిని ఇంచార్జిలుగా నియమించింది.

ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్ లను చండూరు మున్సిపాలిటీ ఇంచార్జ్ లుగా నియమించింది. అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీ ఇంచార్జిలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే చింతం ప్రభాకర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లను నియమించింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులు కేటీఆర్‌‌, హరీశ్‌‌రావుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అప్పగించారు. మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్‌‌చార్జీలుగా నియమితులైన వారంతా దసరా పండుగ తర్వాత కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.