జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేను ఆపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీః జ్ఞానవాపి మసీదులో ఈరోజు ఉదయం ప్రారంభమైన భారత పురావస్తు శాఖ సర్వేను ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నెల 26 వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది. శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు విచారణ జరిపిన చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వెంటనే మసీదులో బుధవారం సాయంత్రం 5.00 గంటల వరకు సర్వే పనులు ఆపాలంటూ ఆదేశించింది.
ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఈ పురావస్తు సర్వే జరగనుందని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ఇంతకు ముందే చెప్పారు. ముందుగా పోలీసు బృందం మసీదులోకి వెళ్లారు. ఆ తర్వాత 40 పురవాస్తు శాఖ అధికారులు లోపలికి వెళ్లారు. అయితే ఓ వైపు సర్వే జరుగుతుండగానే.. మరోవైపు మసీద నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ సర్వేను తాత్కలికంగా ఆపాలంటూ ఏఎస్‌ఐను ఆదేశించింది.