గుంటూరు కారం టాక్

సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ డైరెక్షన్లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై చిన్నబాబు నిర్మించిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 12) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. గతంలో త్రివిక్రమ్ – మహేష్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి అలరించగా..ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు సినిమా ఫై ఆసక్తి నింపడం తో సినిమాను మొదటి రోజు మొదటి షో చూడాలని ఫ్యాన్స్ తహతలాడారు.

అర్ధరాత్రి నుండే ఈ సినిమా సందడి మొదలైంది. హైదరాబాద్ లో అర్ధరాత్రి 1 గంటకే షోస్ మొదలుకాగా..మిగతా చోట్లా ఉదయం 4 గంటల నుండి షోస్ ప్రారంభమయ్యాయి. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా టాక్ ను వ్యక్తం చేస్తున్నారు. మహేష్ వన్ మాన్ షో అని చెపుతున్నారు. యాక్షన్ , డాన్స్ , డైలాగ్స్ ఇలా ప్రతి దాంట్లో మహేష్ న్యాయం చేసాడని , శ్రీ లీల మరోసారి అదరగొట్టింది అని చెపుతున్నారు. త్రివిక్రమ్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లే , డైరెక్షన్తో ఆకట్టుకున్నాడని అంటున్నారు. కాకపోతే కొన్ని చోట్ల బోరింగ్ సన్నివేశాలు , స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టిందని అంటున్నారు.