కొవిడ్-19పై నేడు ఉన్నత స్థాయి సమావేశం
మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులు ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి కోవిడ్-19 పై నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, డిజిపి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హజరుకానున్నారు. ఈ సమావేశం నేడు ఉదయం 11గంటలకు జగనుంది. అలాగే మధ్యాహ్యం 12 గంటలకు కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తీరు, వ్యవసాయ ఉత్త్పత్తులు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/