పులివెందులలో కాల్పుల కలకలం..

పులివెందులలో కాల్పుల కలకలం రేపాయి. అప్పు వ్యవహారంలో స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద దిలీప్‌, మస్తాన్‌ బాషాలపై భరత్‌కుమార్ యాదవ్‌‌ అనే వ్యక్తి కాల్పులు జరుపడంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దిలీప్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భరత్‌కుమార్ అనే వ్యక్తి కడప వైస్సార్సీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడని తెలుస్తుంది. భరత్ జరిపిన కాల్పుల్లో టిడిపి పార్టీ కి చెందిన కార్యకర్త దిలీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తుపాకీతో 4 రౌండ్లు కాల్పులకు పాల్పడ్డాడు భరత్. ఛాతీపై కాల్పులు జరపడంతో టీడీపీ కార్యకర్త దిలీప్‌ ప్రాణాలు వదిలాడు. మరోవైపు తీవ్రగాయాలతో బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటు కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్.. పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇక వివేకా హత్య కేసులో భరత్ యాదవ్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ కేసు ఇంకా ఎటూ తేలకముందే.. ఇప్పుడు కాల్పులు జరగడం పులివెందులలో చర్చనీయాంశంగా మారింది.