గాడ్ ఫాదర్ టికెట్స్ ధరలు బాగా తగ్గించారు

ఆచార్య ఫలితం కారణంగా చిరంజీవి నటించిన తాజాగా చిత్రం గాడ్ ఫాదర్ మూవీ టికెట్ ధరలను భారీగా తగ్గించారు. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తి గా ఉన్నారు.

ఇదిలా ఉంటె గాడ్ ఫాదర్ చిత్ర టికెట్ ధరలను భారీగా తగ్గించారు. ‘గాడ్‌ఫాదర్‌’ టిక్కెట్‌ రేట్లు సాధారణ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే ‘ఆచార్య’ సినిమాకు మాత్రం అప్పుడు సింగిల్‌ థియేటర్‌లో రూ.200 ఉంది. ఇప్పుడు ఏకంగా రూ. 50 తగ్గించి, రూ.150 చేశారు. ఆచార్య సినిమా కలెక్షన్‌లు అంత తక్కువ రావడానికి ఒక రకంగా టిక్కెట్‌ రేట్లు కూడా కారణం అయ్యాయి. ఇక ‘గాడ్‌ఫాదర్‌’ విషయంలో అలాంటి తప్పు చేయకూడదని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్‌లతో మాట్లాడి టిక్కెట్‌ రేట్లను తగ్గించారట.