తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పు..8 నెలల పాప మరణానికి కారణమైంది

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాల జాగ్రత్తగా ఉండాలి..ఆ పిల్లలు ఏంచేస్తున్నారనేదానిపై కన్నేసి ఉండాలి. వారు ఏంచేస్తున్నారు..ఏం నోట్లో పెట్టుకుంటున్నారో..ఏంపట్టుకుంటున్నారు..ఇవన్నీ చూస్తూ ఉండాలి..లేదంటే జరగరాని ప్రమాదం జరుగుతుంది. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఇవన్నీ పట్టించుకోకుండా వారి పనుల్లో వారు బిజీ గా ఉంటారు. కానీ అప్పటికే జరగరాని ప్రమాదం జరుగుతుంది. తాజాగా ఉత్తరకన్నడ లో ఓ తల్లిదండ్రులు ఫోన్ ఛార్జింగ్ పెట్టి..ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలిపెట్టారు. ఆ క్షణమే 8 నెలల పాప ఆ ఛార్జింగ్ వైర్ నోట్లో పెట్టుకోవడం తో కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. ఈ ఘటన ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదం నింపింది.

సిద్దర గ్రామానికి చెందిన హెస్కామ్ కాంట్రాక్ట్ ఉద్యోగి సంతోష్, సంజన దంపతుల 8 నెలల కూతురు సానిధ్య విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఛార్జింగ్ పెట్టిన తర్వాత తల్లిదండ్రులు మొబైల్ స్విచాఫ్ చేయలేదు. పిల్లలు ఏది చూసినా నోటిలో వేసుకుంటారు. అదేవిధంగా చిన్నారి సానిధ్య కూడా నోట్లో ఛార్జర్ పిన్ పెట్టడంతో విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే బైక్‌పై చిన్నారిని క్రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పు..నిండు నూరేళ్లు బ్రతకాల్సిన పాప 8 నెలలకే కన్నుమూసింది.