గుజరాత్ ఎన్నికలు.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

Gujarat Elections 2022: Congress releases list of star campaigners

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. అందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ నాయకులు సచిన్‌ పైలెట్‌, జిగ్నేశ్‌ మెవానీ, దిగ్విజయ్‌సింగ్‌, కమల్‌నాథ్‌ తదితరుల పేర్లు ఉన్నాయి.

కాగా, ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్‌ విభాగాల్లో 10 లక్షల ఉద్యోగాలు, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, రూ.500కి ఎల్‌పిజి సిలిండర్‌,300 యూనిట్లు కరెంటు వంటి కీలక వాగ్దానాలతో.. ప్రజల ముందకు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‭లో… బిజెపికి ధీటుగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేయనున్నారు. అలాగే.. ఉద్యోగం లేని యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, దివ్యాంగులు, వితంతువులు, సీనియర్ సిటిజన్లు, నిరుపేద మహిళలకు రూ.2వేల పెన్షన్, మత్స్యకారులకు రూ.3 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో తెలిపింది. ముఖ్యంగా 2002 బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న 11 మందిని జైలు నుంచి ముందస్తుగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపశమనాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే… అహ్మదాబాద్‌లోని మోటేరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా పునరుద్ధరిస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/